ఓపెన్ జిమ్‌లపై పట్టింపు కరువు నిర్వహణ గాలికొదిలేసిన అధికార యంత్రాంగం విరిగిన వ్యాయామ పరికరాలకు మరమ్మతులు శూన్యం పట్టణ ప్రజలకు తప్పని ఇబ్బందులు
ఇది ఎల్లాగౌడ్ తోట చిల్ట్రన్స్ పార్కులో ఏర్పాటు చేసిన పిల్లలు ఆడుకునే పరికరం. మొదట ఏర్పాటు చేసిన సమయంలో బాగా నే ఉంది. అనంతరం కొద్దికొద్దిగా వంగిపో యింది. పిల్లలు దీనిపై ఎక్కి తిరిగేందుకు ఇ బ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో చు ట్టూ వరద చేరి కనీసం తిరగలేని పరిస్థితి ఉంటుందని పార్క్‌కు వచ్చిన వారు తెలిపారు.
ఆసిఫాబాద్‌అర్బన్/కాగజ్‌నగర్‌టౌన్: చలికాలం వచ్చేసింది. యువతతోపాటు మహిళలు, ఉద్యోగులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉదయమే వ్యాయామం చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉద్యోగార్థులు కూడా కసరత్తు ప్రారంభించారు. కానీ జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల పరిధిలో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లు నిర్వహణ లేక అధ్వానంగా మారాయి. చాలావరకు పరికరాలు విరిగిపోయినా మరమ్మతులు చేయించడం లేదు. ఆహ్లాదం కోసం వచ్చే చిన్నారులు ఆడుకునేందుకు అనుగుణంగా లేకుండా పోయాయి. జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లను శుక్రవారం ‘సాక్షి’ పరిశీలించగా, పలు సమస్యలు వెలుగు చూశాయి.
మున్సిపాలిటీల్లో ఇలా..
చలికాలం కావడంతో జిల్లా కేంద్రంలోని చిల్డ్డ్రన్స్ పార్క్‌లోని ఓపెన్ జిమ్‌కు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక్కడ పూర్తిస్థాయిలో పరికరాలు ఏర్పాటు చేయలేదు. చేసినవి కూడా చాలా వరకు విరిగిపోవడంతో వాకర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్క్ నిర్వహణకు కార్మికుల సంఖ్య పెంచడంపాటు అదనపు నిధులు కేటాయించి వసతులు కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుతం మున్సిపల్ అధికారులు కోతులను పడుతుండటంతో పార్క్‌ను మూసి వేశారు. రెండు, మూడు రోజుల్లో మళ్లీ తెరుస్తామని వారు తెలిపారు. ఇక కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఆరుచోట్ల ఓపెన్ జిమ్‌లు ఉన్నాయి. పట్టణంలోని ఎల్లాగౌడ్‌తోట, గాంధీపార్కు, ఎమ్మెల్యే క్యాంపు సమీపంలోని కాపువాడ, రైల్వే స్టేషనకు వెళ్లేదారిలో, ఈద్గా కాలనీ సమీపంలో, సర్‌సిల్క్ కాలనీలో వీటిని ఏర్పాటు చేశారు. కానీ నిర్వహణ లేక పరికరాలు దెబ్బతిన్నా పట్టించుకునే వారు కరువయ్యారు. మున్సిపల్ అధికారులు స్పందించి ఓపెన్ జిమ్‌ల్లో పరికరాలకు మరమ్మతులు చేయించడంతోపాటు సక్రమంగా నిర్వహణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


