రెబ్బెన: బాలల భద్రత అందరి బాధ్యత అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి అనూష అన్నారు. మండలంలోని గోలేటిలో శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామస్తులకు చట్టాలు, హక్కులు, ఉచిత న్యాయ సహాయ సేవలపై అవగాహన కల్పించారు. పోక్సో, ఎన్టీపీఎస్, సీనియర్ సిటిజన్స్ తదితర చట్టాల గురించి వివరించా రు. న్యాయ సహాయం అవసరమైన వారు 15100 జాతీయ న్యాయ సేవల హెల్ప్‌లైన్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించా రు. సర్పంచ్ అజ్మీర బాబురావు, ఎస్సై వెంకటకృష్ణ, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అంజనీదేవి పాల్గొన్నారు.


