ఆసిఫాబాద్రూరల్: బతుకమ్మ, దసరా సెలవుల అనంతరం శుక్రవారం పాఠశాలలు పు నఃప్రారంభమయ్యాయి. తొలిరోజు విద్యార్థుల హాజరు కేవలం 35శాతమే నమోదైంది. ఈ నెల 23న కనీసం 80 శాతం హాజరు ఉండాలని దసరా సెలవులకు ముందు కలెక్టర్ కె.హరిత విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. జిల్లాలోని 736 ప్రభుత్వ పాఠశాలల్లో 41,218 మంది విద్యార్థులు ఉన్నారు. శుక్రవారం 14,634(35.65శాతం) మంది హాజరయ్యారు. ఆసిఫాబాద్ మండలంలో 20 శాతం మాత్రమే హాజరు నమోదు కాగా, సిర్పూర్(యు) 26.8, తిర్యాణి 29.8, పెంచికల్పేట్ 30.1 శాతం మంది విద్యా ర్థులు మాత్రమే స్కూళ్లకు వెళ్లారు. ఒక్క లింగాపూర్ మండలంలో మాత్రమే హాజరు 50 శాతం దాటింది. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 360 మంది విద్యార్థులకు కేవలం 26 మంది, బూర్గుడ ఉన్నత పాఠశాల 252 మందికి 10మంది, ప్రైమారీ స్కూల్లో 70 మందికి 16 మంది హాజరయ్యారు.


