కాగజ్‌నగర్‌టౌన్: అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్(యూఐడీఎఫ్) కింద కాగజ్‌నగర్ మున్సిపాలిటీకి మంజూరైన రూ.18.70 కోట్ల విలువైన పనులు టెండర్లలో అక్రమాలపై ‘సాక్షి’లో ఈ నెల 22న ప్రచురితమైన ‘కమీషన్ల కలకలం!’ కథనానికి అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మా ట్ స్పందించారు. శుక్రవారం ఆయన పట్టణంలో పర్యటించి వివరాలు సేకరించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మొత్తం 8 ప్యాకేజీలకు నాలుగు నెలల క్రితం టెండర్ల ప్రక్రియ చేపట్టగా.. కాంట్రాక్టర్లు సిండికేట్ అయ్యారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన పనుల వివరాలు, టెండర్ ప్రక్రియ, కాంట్రాక్టర్ల వివరాలు, ఆర్డర్ కాపీలు, టెక్నికల్ అనుమతులు తదితర విషయాలపై ఆరా తీశారు. ఈ విషయంపై ‘సాక్షి’ ఆయనను సంప్రదించగా, యూఐడీఎఫ్ నిధులతో చేపట్టే పనులకు సంబంధించిన దస్త్రాలను తన వెంట తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. కలెక్టర్‌కు నివేదించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే మున్సిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల వేతనాల చెల్లింపు సమస్యను పరిష్కరిస్తామన్నారు. 30 వార్డుల్లోని భవనాలు, నివాస గృహాలు, ఇతర ఆదాయపు పన్ను వసూలయ్యే మార్గాలపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. సోమవారం నుంచి ఆస్తిపన్ను వసూలు చేస్తే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
ఎఫెక్ట్


