కాగజ్‌నగర్‌టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని 130 రోజులుగా కార్మికులు నిరాహార దీక్షలు చేస్తున్నా.. యాజమాన్యం కోర్టులో కేసు వేసి కాలయాపన చేస్తోందని తెలంగాణ ఉద్యమకారుల సంఘం సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. పట్టణంలోని ఎస్పీఎం రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని శనివారం ఏఐసీసీ మహిళా కార్యదర్శి అదితతో కలిసి సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించి, గెలుపొందిన యూనియన్‌తో వేతన ఒప్పందం చేపట్టాలని డిమాండ్ చేశారు. అదిత ఆధ్వర్యంలో వేసిన పిటిషన్ 7న బెంచ్‌పైకి వస్తుందని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, నాయకులు భిక్షపతి, శంకర్‌గౌడ్, శ్రీనివాస్, రమేష్, రవి, షరీఫ్, వెంకటేశ్ పాల్గొన్నారు.


