జపాన్ ఎక్స్‌ప్లోజర్ విజిట్‌లో భాగంగా ఈ నెల 6 నుంచి 12 వరకు జపాన్ విద్యావిధానాన్ని పరిశీ లించాం. టోక్యో నగరంలోని పాఠశాలలు, కళాశాలలు, సమీపంలోని సుకుబా యూనివర్సిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, టీచర్ ట్రైనింగ్ సంస్థ, స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేషన్ స్కూల్ ఫర్ ఫిజికల్లి చాలెంజ్ తదితర సంస్థలను సందర్శించాం. విద్యార్థులు మాతృభాషలో చదువుకుంటున్నారు. ప్రీప్రైమరీ స్థాయి నుంచే టీం వర్క్ ఉంటుంది. నిత్య జీవితంలో ఉపయోగపడేలా వృత్తి విద్య, రోబోటిక్స్ నేర్పిస్తున్నారు. విద్యార్థులు ప్రయోగాలు చేసేలా ల్యాబ్స్ ఉన్నాయి. అక్కడ నేర్చుకున్న అంశాలను మా పాఠశాల విద్యార్థులకు అందిస్తా. – రంగయ్య, సావర్‌ఖేడా హెచ్‌ఎం


