వినాయక విజయం | - | Sakshi
Sakshi News home page

వినాయక విజయం

Sep 27 2026 12:16 AM | Updated on Sep 27 2026 12:16 AM

విఘ్నాలు కలగకుండా.. ఆద్యంతం ప్రశాంతంగా.. జిల్లాలో విజయవంతంగా ముగిసిన గణేశ్‌ నిమజ్జనోత్సవం పక్కా ప్రణాళికతో వ్యవహరించిన ప్రభుత్వ శాఖలు సత్ఫలితాలిచ్చిన ముందస్తు చర్యలు

కౌటాల: జిల్లాలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా వినాయక నిమజ్జనోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. పోలీసుశాఖతోపాటు అగ్నిమాపక, రెవెన్యూ, మున్సిపల్‌ తదితర శాఖలు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించడం, పటిష్ట చర్యలు తీసుకోవడంతో ఈ ఏడాది ఎలాంటి అవాంఛనీయ ఘ టనలు లేకుండా గణనాథుడు గంగమ్మ ఒడిని చేరా డు. ఈ ఏడాది జిల్లాలో మొత్తం 1191 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. బ్లూకోట్‌ సిబ్బంది తమ వద్ద ఉన్న ట్యాబ్‌లో గణపయ్య మండపాల ఫొటోలు తీసి ఆన్‌లైన్‌ ద్వారా జియోట్యాగింగ్‌ చేశారు.

పకడ్బందీ బందోబస్తు.. నిత్యం పర్యవేక్షణ

జిల్లా కేంద్రంతోపాటు కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ సమీపంలోని పెద్దవాగు వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చే శారు. జిల్లావ్యాప్తంగా చివరి మూడు రోజుల్లో సు మారు వెయ్యి వరకు విగ్రహాలను నిమజ్జనం చేశా రు. రెండు రోజులపాటు వర్షం ఆటంకం కలిగించినా ఉన్నతాధికారులు వెనుకడుగు వేయలేదు. కలెక్టర్‌ కె.హరిత, ఎస్పీ నితిక పంత్‌, అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులు నిత్యం వర్షంలోనూ పర్యవేక్షించారు. శోభాయాత్రల నేపథ్యంలో మద్యం షాపులను సైతం మూసివేయించారు. ఎస్పీ, ఏఎస్పీతో పాటు ఇద్దరు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 28 మంది ఎస్సైలు, 366 మంది పోలీస్‌ సిబ్బంది అలసట లేకుండా విధులు నిర్వర్తించారు. జిల్లాలోని 1082 మండపాలకు కనెక్షన్లు అందించి నిరంతరం విద్యుత్‌ సరఫరా చేశారు. విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలోనూ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చిన సిబ్బందిని ఎస్‌ఈ ఉత్తమ్‌ జాడె అభినందించారు.

చవితికి ముందే కసరత్తు

వినాయక చవితి ప్రారంభానికి ముందే ప్రభుత్వ శా ఖలు కసరత్తు ప్రారంభించాయి. 15 రోజుల ముందు నుంచే శాంతి కమిటీ సమావేశాలు, యువత, మండపాల నిర్వాహకులకు అవగాహన కల్పించా రు. మండపాలకు అనుమతి, విద్యుత్‌ కనెక్షన్లు, వే లాడుతున్న విద్యుత్‌ తీగల తొలగింపు, తాగునీరు, ర్యూట్‌ మ్యాప్‌, నిమజ్జనం వద్ద ఏర్పాట్లపై దిశానిర్దేశం చేసి పనులు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముఖ్యమైన ప్రాంతాల్లో ఫ్లాగ్‌మార్చ్‌లు నిర్వహించారు. కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీల పరిధిలో డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు సైతం చేపట్టారు. జిల్లావ్యాప్తంగా వేడుకలు విజయవంతం కావడంతో సంబంధిత అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement