పెంచికల్‌పేట్: మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపొద్దని కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ అన్నారు. మండలంలోని చేడ్వా యి గ్రామంలో సోమవారం నిర్వహించిన గ్రామసభలో మాట్లాడారు. తల్లిదండ్రులు ఎ దిగే పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు వివరాలు చెప్పొద్దని సూచించారు. వాట్సాప్ గ్రూ పుల్లో రాజకీయ పార్టీలు, వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, వివాదాస్పద పోస్టులు పెట్టడం ద్వారా సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని కోరారు. గ్రామాల్లో గంజాయి, నకిలీ విత్తనాల విక్రయాలు, వినియోగం గురించి తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో సీఐ కుమారస్వామి, ఎస్సై అనిల్‌కుమార్, సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ నానాజీ, వార్డు సభ్యులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.


