ఆసిఫాబాద్‌అర్బన్: నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లుగా పని చేస్తున్న ఉద్యోగులకు ఆరు నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ యూనియన్(ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో వినతిపత్రం అందించారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షు డు ఆత్మకూరి చిరంజీవి మాట్లాడుతూ గతేడా ది నవంబర్ 12 నుంచి కెరమెరి పీహెచ్‌సీ పరిధిలోని మోడి, దేవాపూర్ సబ్ సెంటర్లు, అడ పీహెచ్‌సీ పరిధిలోని చిర్రకుంట, గుండి సబ్ సెంటర్లలో ఎంఎల్‌హెచ్‌పీలుగా పనిచేస్తున్న వారికి వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. కార్యక్రమంలో సిబ్బంది రవీనా, ప్రత్యూష, స్నేహ, అనూష తదితరులు పాల్గొన్నారు.


