పరిశుభ్రతతో ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

పరిశుభ్రతతో ఆరోగ్యం

Jun 8 2026 11:30 PM | Updated on Jun 8 2026 11:30 PM

ఆసిఫాబాద్‌: వర్షాకాలంలో పరసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని మున్సిపల్‌ చైర్మన్‌ మెంగ్రె ఆకాశ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రత్యేక వార్డు సభలకు వైస్‌ చైర్మన్‌ ఎండీ అహ్మద్‌తో కలిసి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. డ్రెయినేజీల్లో ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలతో నీరు నిలిస్తే దోమలు వ్యాప్తి చెందే ప్రమాదముందని పేర్కొన్నారు. సమస్యలుంటే ప్రజలు కౌన్సిలర్ల దృష్టికి తేవాలని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో కౌన్సిలర్లు బాలకృష్ణ, దూడల లక్ష్మి, మున్సిపల్‌ మేనేజర్‌ సర్వర్‌, ట్రాన్స్‌కో ఏఈ లక్ష్మీరాజం, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement