మిల్లు పునః ప్రారంభం నుంచీ స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా ఇతర రాష్ట్రాల వారికి ఎక్కువ వేతనాలు ఇస్తున్నారు. దేవాపూర్, ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీల్లో కార్మిక సంఘాల ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎస్పీఎంలో ఎందుకు నిర్వహించడంలేదు..? గుర్తింపు యూనియన్ వస్తే యాజమాన్యం చేస్తున్న అక్రమాలు, దుర్మార్గాలు బయటపడుతాయనే భయంతోనే ఎన్నికలను అడ్డుకుంటున్నారు. కార్మికుల నిరాహార దీక్షలు, మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి.
– డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్,
బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


