ప్రజావాణికి వినతుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణికి వినతుల వెల్లువ

Jun 8 2026 11:30 PM | Updated on Jun 8 2026 11:30 PM

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాని కి వినతులు వెల్లువెత్తాయి. అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌, డీఆర్‌వో దాసరి వేణుతో కలిసి కలెక్టర్‌ కె.హరిత వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణి అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరిస్తామన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా దివ్యాంగ పింఛన్‌ మంజూరు చేయాలని రెబ్బెన మండల కేంద్రానికి చెందిన కౌశిక్‌, కల్యాణ్‌, తుంగెడ గ్రామానికి చెందిన సంధ్య వేర్వేరుగా అర్జీలు అందించారు. వ్యవసాయ భూమిని కౌలుకు ఇస్తే కబ్జా చేశారని, తిరిగి తనకు ఇప్పించాలని సిర్పూర్‌(టి) మండలం కొమ్ముగూడకు చెందిన దుర్గం హుక్టూ విన్నవించాడు. తన భర్త మరణించిన నేపథ్యంలో ఎల్‌ఐసీ బీమా డబ్బులు ఇప్పించా లని కాగజ్‌నగర్‌ మండలం నజ్రూల్‌నగర్‌కు చెందిన కవిత మండల్‌ వేడుకుంది. ఆసరా పింఛన్‌ డబ్బులు బ్యాంకు ద్వారా ఇప్పించాలని ఆసిఫాబాద్‌ మండలం గుండి గ్రామానికి చెందిన నవీన్‌ దరఖాస్తు చేసుకున్నాడు. తన భూమిలో అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కాగజ్‌నగర్‌ మండలం అంకుసాపూర్‌ గ్రామానికి చెంది న పెరుగు కమలాబాయి అర్జీ చేసుకుంది. రెండు నెలలుగా నిలిచిపోయిన ఆసరా పింఛన్‌ను వెంటనే పునరుద్ధరించాలని చింతలమానెపల్లి మండలం కర్జెల్లి గ్రామానికి చెందిన శంకరయ్య కోరాడు. ఉపాధి కల్పించాలని బెజ్జూర్‌ మండలం రెబ్బెనకు చెందిన మల్లేశ్‌ దరఖాస్తు చేసుకున్నాడు.

గుడిసెల్లో ఉంటున్నాం.. ఇళ్లు ఇవ్వండి

కెరమెరి మండలం కేస్లాగూడ, చిన్నుగూడ గ్రామాల్లో 26 ఆదివాసీ కుటుంబాలకు చెందిన వాళ్లం గుడిసెల్లో బతుకు వెల్లదీస్తున్నాం. కాలమేదైనా ఇబ్బందులు తప్పడం లేదు. పలుమార్లు అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కావడం లేదు. పీఎం జన్‌మన్‌, ఇందిరమ్మ ఇళ్ల పథకాల ద్వారా సొంతిళ్లు మంజూరు చేయాలి.

– కేస్లాగూడ, చిన్నుగూడ గ్రామస్తులు, మం.కెరమెరి

మృతదేహాలు పాతిపెట్టడం ఆపాలి

జిల్లా కేంద్రంలోని సిద్ధివి నాయక కాలనీ(10 వార్డు)ని ఆనుకుని ఉన్న స్థలంలో అనధికారికంగా మృతదేహాలను పాతిపెట్ట డం ఆపాలి. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం. కాలనీ గుండా మృతదేహాలను తీసుకెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.

– సిద్ధివినాయక కాలనీవాసులు, ఆసిఫాబాద్‌

Advertisement
 
Advertisement
Advertisement