సర్కారు బడులను చక్కదిద్దుతా | - | Sakshi
Sakshi News home page

సర్కారు బడులను చక్కదిద్దుతా

Jun 8 2026 11:30 PM | Updated on Jun 8 2026 11:30 PM

వసతులు మెరుగుపర్చడమే లక్ష్యం చదువు ప్రాముఖ్యతపై తల్లిదండ్రుల అవగాహన కల్పిస్తాం ‘సాక్షి’తో డీఈవో సచ్చిదానంద చారి

ఆసిఫాబాద్‌రూరల్‌: ‘విద్యతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కానీ తక్కువ అక్షరాస్యతతో జిల్లా చదువులో వెనుకబడింది. చదువు ప్రాముఖ్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం. సర్కారు బడులను తీర్చిదిద్ది చిన్నారులకు మెరుగైన విద్యనందించడమే లక్ష్యంగా పని చేస్తాం..’అని నూతన జిల్లా విద్యాధికారి సచ్చిదానంద చారి అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు నిత్యం పర్యవేక్షిస్తూ.. విద్యాశాఖను బలోపేతం చేస్తామన్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ.. విద్యార్థుల హాజరు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సోమవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరాలు వెల్లడించారు.

సాక్షి: వెనుకబడిన జిల్లాలో విద్యారంగాన్ని బలోపే తం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

డీఈవో: జిల్లాలో 738 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా యి. 2,072 మంది ఉపాధ్యాయులు ఉండగా, 39,249 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉపాధ్యాయుల హాజరును ప్రతిరోజూ పర్యవేక్షిస్తూ గైర్హాజరు కాకుండా చూస్తా. విద్యార్థుల సంఖ్యకు అ నుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి నాణ్యమైన విద్యనందిస్తాం. ప్రాథమిక విద్యను బ లోపేతం చేస్తాం. 24 గంటలపాటు అందుబాటులో ఉంటాను. క్షేత్రస్థాయిలో పాఠశాలలను రోజు వారీగా తనిఖీ చేస్తూ విద్యార్థుల్లో చదివే నైపుణ్యాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటాం.

సాక్షి: 2026– 27 విద్యా సంవత్సరంలో ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తారు?

డీఈవో: ఈ నెల 6 నుంచి బడిబాట కార్యక్ర మం ప్రారంభమైంది. 15వ తేదీ నుంచి పాఠశాలలు పు నఃప్రారంభం కానున్నాయి. బడీడు పిల్లలను ప్రభు త్వ పాఠశాలల్లోనే చేర్పించేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు. తమ పరిధిలోని పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు ఇంటింటికీ తిరుగుతూ సౌకర్యాలు, ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, యూనిఫాంతోపాటు ఈ విద్యా సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉదయం పూట స్నాక్స్‌ గురించి వివరిస్తున్నారు. బడిబాటలో ఇప్పటివరకు 754 మందికి నూతన అడ్మిషన్లు ఇచ్చాం. గతేడాది కంటే ఈ సంవత్సరం 10 శాతం ప్రవేశాల సంఖ్య పెంచుతాం. సర్కారు బడిలో మెరుగైన విద్య అందుతుందనే నమ్మకం తల్లిదండ్రుల్లో కలి గించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం. తల్లి దండ్రులు సైతం అడ్మిషన్లు పూర్తయిన తర్వాత వా రంలో ఒకరోజు పాఠశాలకు వెళ్లి తమ పిల్లల అభ్యసన సామర్థ్యాల గురించి తెలుసుకోవాలి. తద్వారా ఉపాధ్యాయుల్లో బాధ్యత పెరుగుతుంది.

సాక్షి: విద్యార్థులకు అందించేందుకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌, యూనిఫాం సిద్ధంగా ఉన్నాయా?

డీఈవో: జిల్లా కేంద్రం నుంచి అన్ని మండలాలకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ తరలించాం. జిల్లాకు 1,48,880 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, 90,320 పుస్తకాలు వచ్చాయి. యూనిఫాం స్టిచ్చింగ్‌ కొనసాగుతుండగా, 50 శాతం పూర్తయ్యింది. జూ న్‌ 15న పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందిస్తాం. అలాగే జిల్లాలో రెండు విడతల్లో 212 పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించాం. అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులను పూర్వ ప్రాథమిక విద్య కోసం ప్రభు త్వ పాఠశాలల్లో చేర్పించాలి.

సాక్షి: ప్రైవేట్‌ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజు వసూలు, పుస్తకాలు, డ్రెస్సులు అమ్ముతున్నారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు..?

డీఈవో: జిల్లాలో మొత్తం 115 ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. ఆయా స్కూళ్ల యాజమాన్యాలు ప్రభు త్వ నిబంధనలను పాటించాలి. అధిక ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. స్కూళ్లలో పుస్తకాలు, యూనిఫాం పేరుతో వ్యాపారం చేస్తే ఉపేక్షించేది లేదు.

Advertisement
 
Advertisement
Advertisement