ప్రజాపాలనతో ఇంటింటికీ సంక్షేమం | - | Sakshi
Sakshi News home page

ప్రజాపాలనతో ఇంటింటికీ సంక్షేమం

Jun 8 2026 11:30 PM | Updated on Jun 8 2026 11:30 PM

● ఎమ్మెల్సీ దండె విఠల్‌

కాగజ్‌నగర్‌టౌన్‌: నిరుపేదలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రజాపాలనతో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. పట్టణంలోని 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 వార్డుల్లో సోమవారం వార్డు సభలు నిర్వహించారు. 15, 16 వార్డుల్లో నిర్వహించిన సభలకు ఎమ్మెల్సీ దండె విఠల్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ షాహిన్‌ సుల్తానా హాజరయ్యారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ ఫలాలను మరింత చేరువ చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వేదికగా మారిందన్నా రు. ముఖ్యంగా మహిళలు, యువత, రైతులు, వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నా రు. వార్డుల వారీగా తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాలపై వచ్చిన వినతులను పరిశీలించి పరిష్కారా నికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, మెప్మా అధికారులు మోతిరాం, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement