కలెక్టర్‌ను కలిసిన జీఎం | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ను కలిసిన జీఎం

Jun 5 2026 4:17 AM | Updated on Jun 5 2026 4:17 AM

ఆసిఫాబాద్‌: సింగరేణి బెల్లంపల్లి ఏరియా జీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఎం.శ్రీరమే శ్‌ గురువారం కలెక్టర్‌ కె.హరితను జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. బొగ్గు ఉత్పత్తి, కొత్త గనుల విస్తరణ పై సుదీర్ఘంగా చర్చించారు. బెల్లంపల్లి ఏరి యాలో అభివృద్ధిలో గోలేటి ఓపెన్‌ కాస్ట్‌ గని ఎంతో కీలకమైందని, త్వరగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరముందని కలెక్టర్‌కు వివరించారు. ప్రస్తుతం కేవలం ఒక్క ఖైరిగూర ఓసీ నుంచి మాత్రమే బొగ్గు ఉత్పత్తి జరుగుతుందన్నారు. భవిష్యత్‌లో ప్రారంభం కానున్న గనులు, ప్రస్తుతం ప్రతిపాదనల దశలో ఉన్న వివిధ మైనింగ్‌ ప్రాజెక్టుల వివరాలను అందించారు. కొత్తగనుల ప్రారంభానికి ప్రభుత్వపరంగా అనుమతులు వేగంగా లభించేలా జిల్లా యంత్రాంగం తరఫున సహకారం అందించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement