ఆదిలాబాద్: ప్రజా రవాణా సంస్థను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ సంఘం రీజినల్ అధ్యక్షుడు ఎస్బీ రావు అన్నారు. బుధవారం ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట సంఘం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ బస్సులను నేరుగా ఆర్టీసీ సంస్థకే ఇవ్వాలని, రాష్ట్ర బడ్జెట్‌లో సంస్థకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, కార్మిక యూనియన్లపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసి 2017 వేతన సవరణ అలవెన్సులతో పాటు 2021, 2025 వేతన సవరణలను వెంటనే చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి ఎం.భీంరావు, నాయకులు దేవిదాస్, మహేష్, డిపో అధ్యక్ష, కార్యదర్శులు అశోక్, ఆశన్న, దేవిదాస్, మైపాల్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


