శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
కాగజ్‌నగర్ రూరల్: మూఢనమ్మకాలు వీడి శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని విజ్ఞాన దర్శిని ఫౌండర్ రమేశ్ సూచించారు. ప్రకృతి వైజ్ఞానిక యాత్ర కాగజ్‌నగర్ పట్టణానికి చేరుకున్న సందర్భంగా శని వారం పట్టణంలోని వసుంధర డిగ్రీ కళాశాలలో ఏ ర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. టెక్నాలజీ విద్యార్థులు సైన్స్‌తో సహవాసం చేస్తున్నా సైంటిఫిక్ టెంపర్ ఉండటంలేదని పేర్కొన్నారు. ఐఐటీ బాబాలు, తాయెత్తులు, నిమ్మకాయలు మనిషి ధై ర్యాన్ని ఆపలేవని, అపనమ్మకాలు వీడి చదువుతో జ్ఞానవంతులు కావాలని యువతకు పిలుపునిచ్చా రు. అనంతరం టీం లీడర్ జయరాజు మాట్లాడు తూ.. ప్రకృతే సకల జీవకోటికి ఆధారమని, ప్రకృతిని రక్షించుకుంటేనే మానవ మనుగడ సాధ్యమని పేర్కొన్నారు. అవసరాల కోసం అడవులు, కొండలు, గుట్టలు ధ్వంసం చేయకూడదని సూచించారు. ప్రకృతిని రక్షించే బాధ్యత నేటి తరంపై ఉందని తెలిపారు. ప్రకృతి రక్షణకు నడుం కట్టేందుకు తాను 113 స్టోరీలతో అవని అనే పుస్తకాన్ని రచించానని పేర్కొన్నారు. యాత్ర కోఆర్డినేటర్, టీపీటీఎల్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. మహనీయులు సైంటిఫిక్ టెంపర్‌తో బతికారని, అందుకే ప్రజల కోసం పనిచేశారని తెలిపారు. రాజ్యాంగ శాసీ్త్రయ దృక్పథాన్ని అమలు చేయాలని సూచించారు. అమ్మ అవయవదాన సంస్థ ఫౌండర్ ఈశ్వరలింగం, విజ్ఞాన దర్శిని రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాజు, అలీ, మధు, శోభారాణి, భాగ్యమ్మ, జనవిజ్ఞాన వేదిక నాయకులు రవి, జాని, కళాశాల ప్రిన్సిపాల్ నిరత్కర్ తదితరులు పాల్గొన్నారు.


