సీనియర్ లెక్చరర్లకు అవకాశమివ్వాలి
ఆసిఫాబాద్‌రూరల్: ఇంటర్ పరీక్షల విధుల్లో సీనియర్ లెక్చరర్లకు అవకాశం ఇవ్వాలని లె క్చరర్ల సంఘం ఆధ్వర్యంలో శనివారం డీఐ ఈవో రాందాస్‌కు ఆయన కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కోశాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇంటర్ వార్షిక పరీక్షలకు జిల్లాలోని జైనూర్, కెరమెరి, దహెగాం ప్రభుత్వ కళాశాలల సీనియర్ లెక్చరర్లకు మొదట కళాశాలలో సీఎస్ ఆర్డర్ ఇచ్చారని తెలిపారు. ఈ నెల 20 న వారు శిక్షణకు హాజరై పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ తెచ్చుకున్నారని పేర్కొన్నారు. సాయంత్రం డీఐఈవో ఎలాంటి నో టీస్ ఇవ్వకుండా వారి ఆర్డర్ కాపీలను రద్దు చేసి అదే కళాశాలకు చెందిన జూనియర్ లెక్చరర్లకు అవకాశం ఇవ్వడం సరికాదని తెలిపా రు. వారికి అనుభవం లేదని, సీనియర్లకు అ వకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నవీన్‌రెడ్డి, కార్యదర్శి శ్రీనివా స్, నాయకుడు సునీల్ తదితరులున్నారు.


