ఘనంగా మాతృభాష దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా మాతృభాష దినోత్సవం

Feb 22 2026 7:08 AM | Updated on Feb 22 2026 7:08 AM

ఘనంగా మాతృభాష దినోత్సవం

ఘనంగా మాతృభాష దినోత్సవం

కాగజ్‌నగర్‌ రూరల్‌: అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని శనివారం పట్టణంలోని ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో ఘనంగా జరుపుకొన్నారు. తెలు గు, హిందీ, ఇంగ్లిష్‌ విభాగాల ఆధ్వర్యంలో మాతృభాష పరిరక్షణ, ప్రాధాన్యతపై అధ్యాపకులు విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీదేవి మాట్లాడుతూ.. మాతృభాష భావ ప్రకటన ఎంతో శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. నూతన అంశాలను నేర్చుకోవడంలో మాతృభాషను మించిన భాష మరొకటి లేదని తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లక్ష్మీనరసింహం, అకాడమిక్‌ కోఆర్డినేటర్‌ జనార్దన్‌, అధ్యాపకులు రాజేశ్వర్‌, మహేశ్‌, శారద, సంతోష్‌, అపూర్వ, మహా లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement