సొసైటీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
కాగజ్‌నగర్ రూరల్: కొత్తపల్లి వెంకటలక్ష్మి–చంద్రయ్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల ని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ సూచించారు. పట్టణంలోని కి మ్స్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో సొసైటీ ఆధ్వర్యంలో ప్రతీ ఆదివారం నిర్వహించే ఉచిత కంటి పరీక్షకు ఎంపికై న రోగులకు శనివారం ఆయన భోజన సదుపాయాన్ని కల్పించి, ర వాణా ఖర్చులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పది మందిని కంటి ఆపరేషన్ల నిమిత్తం బెల్లంపల్లిలోని లయ న్స్ క్లబ్ కంటి ఆస్పత్రికి తరలించామని పే ర్కొన్నారు. తొమ్మిదేళ్లలో వేలాది మందికి కంటి ఆపరేషన్లు చేయించామని చెప్పారు. ఆస్పత్రి సిబ్బంది గోపి తదితరులు పాల్గొన్నారు.


