ఖందేవ్ జాతర షురూ..
భారీగా తరలివచ్చిన తొడసం వంశీయులు రెండు కిలోల నువ్వుల నూనె తాగిన ఆడపడుచు మహా పూజతో ప్రారంభమైన జాతర
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని ఖందేవ్ ఆలయం పుష్యపౌర్ణమి సందర్భంగా జనసంద్రమైంది. వివిధ రాష్ట్రాల నుంచి తొడసం వంశస్తులు భారీగా తరలిరావడంతో ఆధ్మాత్మిక శోభ సంతరించుకుంది. తొడసం వంశీయులు ఈ నెల 1న గురువారం మాన్కాపూర్ వద్ద మాసేమాల్ పేన్ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి రాత్రి అక్కడే బస చేశారు. 2న శుక్రవారం సాయంత్రం ఖందేవ్ ఆలయానికి చేరుకున్నారు. అదేరోజు రాత్రి మహాపూజతో జాతర ప్రారంభమైంది. 3న శనివారం తొడసం వంశీయుల సంప్రదాయ భేటి నిర్వహించారు.
సంప్రదాయ భేటీ
ఖందేవ్ ఆలయ ప్రాంగణంలో తొడసం వంశీయులు పూజ అనంతరం సంప్రదాయ భేటి నిర్వహించారు. కొత్త కోడళ్లను దేవునికి పరిచయం చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన తొడసం వంశీయులు వారి సాధక బాధలతో పాటు ఆలయ అభివృద్ధిపై చర్చించారు. భావితరాలకు ఆదర్శంగా ఉండేలా ఆలయ అభివద్ధి నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో తొడసం వంశీయులు, కటోడాలు తొడసం మోతీరాం, తొడ సం బాపూరావు, తొడసం ఆనందరావు, తొడసం చిత్రు, పటేళ్లు తొడసం రాజు, తొడసం తెలంగాణరావు, తొడసం గంగు, తొడసం భీంరావు, తొడసం బండు, ఆదివాసీ జేఏసీ చైర్మన్ మెస్రం రూప్‌దేవ్, సర్పంచ్ బానోత్ కావేరి, జ్ఞానేశ్వర్, రాథోడ్ సురేశ్, మాజీ సర్పంచులు బానోత్ గజానంద్ నాయక్, ఉర్వేత రూప్‌దేవ్, మడావి రూప్‌దేవ్, రాథోడ్ రాజునాయక్, ఖందేవ్ ఆలయ కమిటీ సభ్యుడు తొడసం నాగోరావు, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఆదివాసీ ఉద్యోగుల సంఘం నాయకులు మెస్రం శేఖర్‌బాబు, మాజీ జెడ్పీటీసీ బిర్జులాల్ కర్మానకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లోకండే దేవరావు, మార్కెట్ కమిటీ మాజీ వైస్‌చైర్మన్ షేక్ దాదేఅలి, తదితరులు పాల్గొన్నారు.
నువ్వుల నూనె నైవేద్యం..
ఖందేవుని సన్నిధిలో తొడసం వంశీయుల వద్ద నుంచి నువ్వుల నూనె సేకరించి కటోడ దేవుని కి నైవేద్యం సమర్పించారు. అనంతరం తొ డసం వంశ ఆడపడుచు ఆదిలాబాద్ మండలంలోని ఖన్నాపూర్ గ్రామానికి చెందిన సుర్పం సాక్రుబాయి రెండు కిలోల నువ్వుల నూనె తాగి మొదటి మొక్కును తీర్చుకుంది. మహారాష్ట్రలోని జివితి తాలూకా కొద్దేపూర్ గ్రామానికి చెందిన మెస్రం నాకుబాయి రెండు కిలోల నువ్వుల నూనె తాగి మూడోసారి మొక్కు తీర్చుకుంది.
ఖందేవ్ జాతర షురూ..
ఖందేవ్ జాతర షురూ..
ఖందేవ్ జాతర షురూ..


