
కాగజ్‌నగర్‌లో తిరంగా ర్యాలీ
కాగజ్‌నగర్‌టౌన్: రిటైర్డ్ ఆర్మీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో గురువారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. పెట్రోల్‌పంప్ నుంచి మార్కెట్ వీధుల గుండా సర్‌సిల్క్ మీదుగా పెట్రోల్‌పంప్ ఏరియా వరకు ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడుతూ దేశభక్తిని పెంపొందించడానికి ప్రజల్లో ఐక్యతను చాటడాని కి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. పంద్రాగస్టు సందర్భంగా ప్రతీ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, జిల్లా మాజీ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీ నర్ వీరభద్రాచారి, పట్టణ అధ్యక్షుడు శివకుమార్, కోశాధికారి అరుణ లోయ, మండల అధ్యక్షుడు అశోక్, మహిళా మోర్చా జిల్లా అ ధ్యక్షురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.