
నేడు పంద్రాగస్టు వేడుకలు
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలో శుక్రవారం పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించేందు కు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ ఏడాది సమీకృత కలెక్టరేట్ ఆవరణలో వేడుకలు నిర్వహిస్తున్నారు. చెత్తాచెదారం తొలగించి షామియానాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ హాజరుకానున్నారు. గు రువారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్‌తోపాటు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. శుక్రవారం ఉద యం 9.30 గంటలకు పతాకావిష్కరణ, పోలీ స్ గౌరవ వందనం స్వీకరణ అనంతరం ముఖ్య అతిథి జిల్లా ప్రగతిపై ప్రసంగించనున్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు ప్రదానం చేయనున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతారు. కలెక్టర్ జిల్లా అధి కారులతో సన్నాహక సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. లోటుపాట్లు లేకుండా వేడుకలు విజయవంతం చేయాలని ఆదేశించారు. డీఆర్‌డీవో దత్తారావు, కలెక్టరేట్ ఏఈ ఓ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.