
నవోదయ పీఈటీ విజయనగరంలో మృతి
కాగజ్‌నగర్‌టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు ప్రదీప్ (31) గురువారం మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో జూలై 27 నుంచి ఆగస్టు 28 వరకు నిర్వహించ తలపెట్టిన జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు కోచ్‌గా కాగజ్‌నగర్ నవోదయ విద్యాలయం నుంచి వెళ్లాడు. గురువారం మధ్యాహ్నం భోజనం అనంతరం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే వైద్య సహాయం అందించినప్పటికీ ఫలితం లేకపోయిందని ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ తెలిపారు. పీఈటీ మృతితో విద్యాలయం ఉపాధ్యాయులు, సిబ్బంది విజయనగరం బయలు దేరారు.
నేడు బెల్లంపల్లిలో ఉమ్మడి జిల్లా మహాసభ
బెల్లంపల్లి: తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ (టీహెచ్‌డబ్ల్యూ) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహాసభను శుక్రవారం బెల్లంపల్లిలోని అగర్వాల్ భవన్‌లో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గెల్లి రాజలింగు తెలిపారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంటి సామ్రాజ్యం ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నట్లు ఆయన పేర్కొన్నారు. 21 విభాగాల్లో పని చేస్తున్న హమాలీలు పాల్గొంటారని, సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ తయారు చేయనున్నట్లు తెలిపారు.