ఇంటర్ ప్రవేశాల గడువు పెంపు
ఆసిఫాబాద్‌రూరల్: తెలంగాణ మోడల్ స్కూ ళ్లలో ఇంటర్మీడియెట్ ప్రవేశాల గడువు పెంచినట్లు ప్రిన్సిపాల్ ఖలీల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ప్రవేశాల గడు వు ఈ నెల 25తో ముగియగా.. విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 31 వర కు పొడిగించారని పేర్కొన్నారు. ఇప్పటివర కు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. ఎలాంటి రుసుం చెల్లించకుండా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
తేనెటీగల పెంపకంతో స్వయం ఉపాధి
ఆసిఫాబాద్‌అర్బన్: తేనెటీగల పెంపకంతో రైతులు, నిరుద్యోగులు స్వయం ఉపాధి పొందవచ్చని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఐటీడీఏ పరిధిలోని గిరిజన యువతీ యు వకులు, రైతుల కోసం తేనెటీగల పెంపకంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నా రు. ఆసక్తి గల వారు ఐటీడీఏ కార్యాలయం లేదా 98486 87871, 88976 22042, 90323 13933 నంబర్లలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. శిక్షణ లో తేనెటీగల పెంపకంలోని మెలకువలు, మార్కెటింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. తేనెటీగల పెంపకంతో స్వయం ఉపాధి పొందడంతోపాటు పంట దిగుబడులు గణనీయంగా వృద్ధి చెందుతా యని పేర్కొన్నారు.
అథ్లెటిక్స్ పోటీల్లో విద్యార్థిని ప్రతిభ
తిర్యాణి(ఆసిఫాబాద్): జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ సబ్ జూనియర్ పోటీల్లో తిర్యాణి మండలం నాయకపుగూడ గ్రామానికి చెందిన గుండం అకిర నందన ప్రతిభ చూపింది. అండర్ 10 విభాగంలో 80 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. వచ్చే నెల 6, 7 తేదీల్లో హనుమకొండ జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అకిర నందన పాల్గొంటుందని జిల్లా క్రీడా అధికారి మీనారెడ్డి తెలిపారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ కోశాధికారి గుండం లక్ష్మ ణ్ తదితరులు ఉన్నారు.
‘అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారు’
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాలు, ఎరువులు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆసిఫాబాద్ మండలం బాబాపూర్‌కు చెందిన బదావత్ ప్రకాశ్ మంగళవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి ఫిర్యాదు చేశాడు. ఎమ్మార్పీకే విత్తనాలు, ఎరువులు విక్రయించేలా చూడాలని కోరాడు. అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నాడు.