
వేడి.. ఉక్కపోత
కౌటాల(సిర్పూర్): అకాల వర్షాలు, మబ్బులతో చల్లబడిన వాతావరణంతో జిల్లా ప్రజలకు కొద్దిరోజులపాటు ఎండ నుంచి ఉపశమనం లభించింది. శనివారం నుంచి రోహిణి కార్తె ప్రారంభమవుతుండగా మళ్లీ జిల్లాలో ఎండ వేడి పెరిగింది. పగటి పూట తీవ్రమైన ఉక్కపోత, వేడితో ప్రజలు అల్లాడుతున్నారు. చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నాయి. మరమ్మతుల పేరుతో విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ప్రజలు ఉక్కపోతను తట్టుకోలేకపోతున్నారు. శుక్రవారం కాగజ్‌నగర్‌లో అత్యధికంగా 43.7 డిగ్రీల సెల్సియస్ పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా.. తిర్యాణిలో 43.6 డిగ్రీలు, సిర్పూర్(టి) 43.5, రెబ్బెన మండలం వంకులం 43.2, ఆసిఫాబాద్ 43.1, పెంచికల్‌పేట్ మండలం ఎల్కపల్లి 42.6, కౌటాల 42.5, దహెగాం 42.2, జంబుగాలో 42.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.