
ఎన్నికై న సంఘం సభ్యులు
ఆసిఫాబాద్‌అర్బన్: ఆసిఫాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ కార్మికుల కార్యవర్గాన్ని బుధవారం జిల్లా కేంద్రంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మాట్ల రాజు, కార్యదర్శిగా సమ్మయ్య, కోశాధికారిగా శంకర్, ఉపాధ్యక్షులుగా మోతీరాం, రాజు, మోతు లక్ష్మి, సహాయ కార్యదర్శులుగా ప్రభాకర్, సాగర్, శ్రీనివాస్, ఉప్ప లక్ష్మితోపాటు 15 మంది సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం రాజేందర్ మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతినెలా 5 తేదీలోగా వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సబ్బులు, మాస్క్‌లు ఇవ్వాలని, రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను అభినందించారు.