► జాలువారే జలపాతాలు
పెంచికల్‌పేట్ మండలం అగర్‌గూడ అటవీ ప్రాంతంలో ఈ జలపాతం ఉంది. దాదాపు వంద అడుగుల ఎత్తునుంచి దూకే జలధార ఇది. పెంచికల్‌పేట్ నుంచి అగర్‌గూడకు 7 కి.మీ.లు వాహనంలో వెళ్లి, మరో ఐదు కి.మీ.లు నడవాలి.
తిర్యాణి మండలం గుండాల గ్రామ పంచాయతీలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. 50 అడుగుల కొండవాలు నుంచి జాలువారుతోంది. తిర్యాణి నుంచి 10 కి.మీ.ల దూరంలో గల రొంపల్లి వరకు వాహనాల్లో వెళ్లొచ్చు. తర్వాత దట్టమైన అడవిలో ఆరు కి.మీ.లు కాలినడకన వెళ్లాలి.


