చింతకాని: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన నష్టపోయిన జిల్లా రైతాంతాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు భాగం హేమంతరావు డిమాండ్ చేశారు. చింతకాని మండలం నాగిలిగొండలో శుక్రవారం ఏఐకేఎస్ సభ్యత్వ నమోదును ప్రారంభించిన ఆయన మాట్లాడారు. రూ.వేలల్లో పెట్టుబడి రైతులకు పంట చేతికొచ్చే పరిస్థితి లేదని తెలిపారు. తక్షణమే కరువు ప్రాంతంగా ప్రకటించడంతో పాటు సాగర్, గోదావరి జలాలతో చెరువులు, కుంటలు నింపాలన్నారు. సీపీఐ, ఏఐకేఎస్ నాయకులు జమ్ముల జితేందర్రెడ్డి, ఏపూరి రవీంద్రబాబు, ఏనుగు గాంధీ, పదిమల వెంకటనర్సయ్య, చాట్ల రమేష్, హరికొట్ల భారతమ్మ, ఏపూరి నర్సయ్య, అరికొట్ల భాస్కర్, షేక్ హుస్సేన్, కోపెల జ్యోతి, శేషగిరి, పంది శేఖర్, పి.కృష్ణ పాల్గొన్నారు.
ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
భాగం హేమంతరావు


