రిటైనింగ్‌ వాల్‌ భూసేకరణ సాఫీగా.. | - | Sakshi
Sakshi News home page

రిటైనింగ్‌ వాల్‌ భూసేకరణ సాఫీగా..

Oct 7 2026 12:47 AM | Updated on Oct 7 2026 12:47 AM

● చట్టపరమైన మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం ● 144 ఎకరాలకు గాను ఇప్పటికే 22 ఎకరాలపై పరస్పర అంగీకారం ● మిగిలిన భూమి త్వరలోనే సేకరించేలా కసరత్తు

● చట్టపరమైన మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం ● 144 ఎకరాలకు గాను ఇప్పటికే 22 ఎకరాలపై పరస్పర అంగీకారం ● మిగిలిన భూమి త్వరలోనే సేకరించేలా కసరత్తు

ఖమ్మం అర్బన్‌: మున్నేటి వరద ముంపు నుంచి ఖమ్మం నగరం, రూరల్‌ మండలంలోని కాలనీలను రక్షించేందుకు చేపట్టనున్న రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మాణానికి భూసేకరణలో మరో కీలక ముందడుగు పడింది. పోలేపల్లి – ప్రకాశ్‌నగర్‌ మధ్య మున్నేటికి ఇరువైపులా నిర్మించే 17 కి.మీ. మేర రక్షణ గోడకు కావాల్సిన భూసేకరణ కోసం పునరావాస చట్టం–2013లోని చాప్టర్‌–2, 3 నిబంధనల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు 15 రోజులు క్రితం జీఓ జారీ అయింది.

ప్రైవేట్‌ భూమి 144 ఎకరాలు..

రిటైనింగ్‌ వాల్‌ పనులకు ఖమ్మం అర్బన్‌, రూరల్‌ ప్రాంతాల్లో సుమారు 239 ఎకరాల భూమి అవసరమవుతోంది. ఇందులో ప్రభుత్వ, ఎన్నెస్పీ భూములు పోగా 144 ఎకరాల ప్రైవేట్‌ భూమి సేకరించాల్సి ఉంది. రెండు వైపులా సుమారు 22 ఎకరాల భూమిని పరస్పర అంగీకారంతో సేకరించినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన భూమిని చట్టప్రకారం సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం జీఓ జారీ చేయడంతో భూసేకరణ చట్టం లోబడి సేకరిస్తే పనుల్లో వేగం పెరగనుంది. ఇప్పటికే సుమారు 11 కి.మీ. మేర రిటైనింగ్‌ వాల్‌ను నిర్మించినా, భూసమస్యలతో జాప్యం జరిగింది. ఇకపై వేగం పెరిగే అవకాశముంది.

రూ.524 కోట్లతో రెండో దశ

రిటైనింగ్‌ వాల్‌ రెండో దశ అభివృద్ధి పనులకు రూ.524 కోట్లతో ప్రతిపాదనలు ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపించినట్లు తెలిసింది. ఈ దశలో మున్నేటికి ఇరువైపులా 11.5 కి.మీ. గోడ నిర్మించాలని నిర్ణయించారు. ప్రకాష్‌నగర్‌ వంతెన నుంచి దేవరపల్లి హైవే రోడ్డు మున్నేరు క్రాసింగ్‌ వంతెన దాటించే వరకు ఒక్కో వైపు సుమారు 5.75 కి.మీ. రిటైనింగ్‌ వాల్‌ కు ప్రతిపాదించారు. రెండో దశకు ఆర్థిక శాఖ అనుమతి లభిస్తే ధంసలాపురం కాలనీ ప్రాంతంలో వేలాది కుటుంబాలకు వరద నుంచి విముక్తి లభించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement