పెనుబల్లి: మండలంలోని ఉప్పలచెలక ప్రాథమిక పాఠశాలలో గురువారం వైద్యులు, సెంట్రల్ కిచెన్ బృందం పరిశీలించింది. మధిరలోని సెంట్రల్ కిచెన్ నుంచి బుధవారం పంపించిన అల్పాహారం తిన్నాక పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురువారం పరిశీలించిన వారు పూరీ, పాల నాణ్యతపై ఆరా తీశారు. అయితే, పూరీలు గట్టిగా, పాలు పుల్లగా ఉండడంతో పారబోశామని పలువురు తెలిపారు. ఇదే సమయాన తల్లిదండ్రులు వచ్చి అల్పాహారం, మధ్యాహ్న భోజన నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేశారు. మరోపక్క లంకాసాగర్ పీహెచ్‌సీ వైద్యాధికారి కిరణ్, బానోత్ నాగేశ్వరరావు తదితరులు విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఉద్యోగులు రాజ భాస్కర్, ఆకాష్, హెచ్‌ఎం హేమలత పాల్గొన్నారు.
అల్పాహారాన్ని పరిశీలించిన వైద్యబృందం


