విద్యుత్‌ రంగ అభివృద్ధికి రూ.205 కోట్లు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ రంగ అభివృద్ధికి రూ.205 కోట్లు

Oct 2 2026 12:22 AM | Updated on Oct 2 2026 12:22 AM

● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ● ఈఆర్‌ఓ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి

● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ● ఈఆర్‌ఓ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి

ఖమ్మంరూరల్‌: పాలేరు నియోజకవర్గంలో విద్యుత్‌ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా గత 34 నెలల్లో రూ.205 కోట్లు మంజూరు చేసి వివిధ పనులు చేపట్టినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి తరుణి హాట్‌లో కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. సీపీ సునీల్‌దత్‌తో కలిసి డివిజన్‌ ఈఆర్‌ఓ కార్యాలయాన్ని మంత్రి గురువారం ప్రారంభించారు. అనంతరం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో సబ్‌స్టేషన్ల నిర్మాణం, హైటెన్షన్‌ వైర్ల మార్పిడి, కొత్త లైన్లు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు రూ.205 కోట్లు కేటాయించగా, ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు.

ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం

రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చే పథకాన్ని దివంగత సీఎం వై.ఎస్‌.రాజశేఖరెడ్డి హయాంలో ప్రారంభించగా.. తమ ప్రభుత్వం కొనసాగిస్తోందని మంత్రి చెప్పారు. గృహ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్‌ అందిస్తుండగా, రైతుల అవసరాలను దృష్ట్యా విద్యుత్‌ శాఖ బలోపేతానికి మరిన్ని నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. కాగా, ప్రతిపక్ష నాయకులు విద్యుత్‌ రంగంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెల్లడించిన మంత్రి... భద్రాద్రి, యాదాద్రి విద్యుత్‌ ప్రాజెక్టులను గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేస్తే తామే పూర్తిచేసి విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించామని వెల్లడించారు. తెలంగాణ విద్యుత్‌ రంగాన్ని దేశంలోనే అగ్రస్థానాన నిలపడమే లక్ష్యం కాగా, గ్రీన్‌ పవర్‌ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈలు శ్రీనివాసాచారి, యుగంధర్‌రావు, హౌజింగ్‌ పీడీ భూక్యా శ్రీనివాస్‌, ఆర్‌డీఓ ఎన్‌.శ్రీనివాస్‌, ఏదులాపురం మున్సిపల్‌ కమిషనర్‌ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, వైస్‌ చైర్మన్‌ తమ్మినేని నవీన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement