బలమైన ప్రజా ఉద్యమాలే శరణ్యం | - | Sakshi
Sakshi News home page

బలమైన ప్రజా ఉద్యమాలే శరణ్యం

Oct 2 2026 12:22 AM | Updated on Oct 2 2026 12:22 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: ఫాసిస్ట్‌ దాడులు, కార్పొరేట్‌ దోపిడీ, భూస్వాముల అణచివేతను తిప్పికొట్టడానికి భూమి లేనివారు, వ్యవసాయ కార్మికులు, చిన్న, మధ్యతరహా రైతులు సంఘటితమై బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్‌) నేతలు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని న్యూడెమోక్రసీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐకేఎంఎస్‌ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నిర్భయ్‌ సింగ్‌ దుడికే, జే.వీ.చలపతిరావు మాట్లాడారు. జీవనాధార భూమి, అడవులు, నదులను కాపాడుకోవడానికి ప్రజా ఉద్యమాలే ఏకై క మార్గమని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ – బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఇతర డబుల్‌ ఇంజన్‌ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల హక్కులపై చేస్తున్న ఫాసిస్టు దాడులను తిప్పికొట్టాలని పేర్కొన్నారు.

15 మందితో నూతన కమిటీ

ఖమ్మంలో మూడు రోజుల పాటు జరిగిన ఏఐకేఎంఎస్‌ జాతీయ మహాసభల్లో నూతన కేంద్ర కార్యనిర్వాహక కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వెల్లడించారు. జాతీయ అధ్యక్షుడిగా నిర్భయ్‌ సింగ్‌ దుడికే, ప్రధాన కార్యదర్శిగా జే.వీ.చలపతిరావుతో పాటు 15 మందితో కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. అంతేకాక రాబోయే పోరాటాలకు మార్గనిర్దేశం చేసేలా 17 తీర్మానాలను ఆమోదించినట్లు చెప్పారు. పంటల కొనుగోలు హామీతో పాటు కనీస మద్దతు ధర అమలు, రైతులు, వ్యవసాయ కార్మికుల సమగ్ర రుణమాఫీ, భూ గరిష్ట పరిమితి తగ్గింపు, సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలనే తీర్మానాలను ఆమోదించినట్లు వెల్లడించారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్‌ ఉపాధ్యక్షులు టి.సుధాకర్‌, ఆశిష్‌ మిట్టల్‌, కార్యదర్శి రవీందర్‌ సింగ్‌ పాటియాలా, కార్యవర్గ సభ్యులు వి.వెంకట్రామయ్య, గౌని ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

ఏఐకేఎంఎస్‌ జాతీయ నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement