పాల్వంచరూరల్: మండలంలోని కిన్నెరసానిలో ఎకో టూరిజం అభివృద్ధికి రూ.13 కోట్లతో ప్రతిపాదనలు పంపనున్నట్లు వైల్డ్‌లైఫ్ ఎఫ్‌డీఓ బి.బాబు తెలిపారు. పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో పర్యాటకులను అకట్టుకునేలా చేయాల్సిన అభివృద్ధి పనులపై ప్రణాళిక రూపొందించేందుకు మహారాష్ట్రకు చెందిన సటా కన్సల్టెన్సీ ఇంజనీర్ అభిషేక్ శర్మ బుధవారం డీర్‌పార్కు, డ్యామ్ పరిసరాలను వైల్డ్‌లైఫ్ ఎఫ్‌డీఓతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కిన్నెరసాని డీర్‌పార్కు ముఖ ద్వారం రీడిజైనింగ్, విదేశాల్లో మాదిరి ఇండోర్ బటర్ ఫ్లై పార్కు ఏర్పాటు, డిజిటల్ సమాచారం కేంద్రం ఆధునికీకరణ, డ్యామ్ సమీపంలో వ్యూపాయింట్, జలాశయం మధ్యలో ఉన్న ఐలాండ్ అభివృద్ధిపై చర్చించారు. ఈమేరకు డీపీఆర్ తయారీకి అవసరమైన వివరాలను సేకరించచగా త్వరలోనే ప్రతిపాదనలు సిద్ధమవుతాయని ఎఫ్‌డీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో రేంజర్ కవితమాధురి, ఎఫ్‌ఎస్‌ఓ కిషన్, ఎఫ్‌బీఓ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపాదనలు పరిశీలించిన అధికారులు


