నైరుతి ముగిసింది! | - | Sakshi
Sakshi News home page

నైరుతి ముగిసింది!

Oct 1 2026 12:41 AM | Updated on Oct 1 2026 12:41 AM

ఎల్‌నినో పంజా గత ఏడాదితో పోలిస్తే.. ఆదుకున్న అల్పపీడనం 26 శాతం లోటు

అత్యధిక లోటు వర్షపాతం

నమోదైన మండలాలు

నెలల వారీగా వర్షపాతం వివరాలు

(సెం.మీ.ల్లో.)

నాలుగు నెలల్లో 16 మండలాల్లో లోటు వర్షపాతం గత నెల వర్షాలతో సాగు చేసిన పంటలకు ఊరట పంట చేతికి వచ్చే వరకు అల్పపీడనాలపైనే ఆశలు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: నైరుతి రుతుపవన కాలం ముగిసింది. ఈ ఏడాది సీజన్‌(జూన్‌ నుంచి సెప్టెంబర్‌) ముగిసే సమయానికి జిల్లాలో సగటున 26శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌లో ఆశించిన దానికంటే ఎక్కువగానే వర్షం కురిసినా.. పంటల సాగు ముమ్మరమయ్యే జూలై, ఆగస్టు నెలల్లో మాత్రం వరుణుడు ముఖం చాటేశాడు. సెప్టెంబర్‌ ఆఖరులో కురిసిన వానలు కొంత ఊరటని చ్చినా.. మొత్తంగా చూస్తే జిల్లా తీవ్ర వర్షపాత లోటును ఎదుర్కొంటోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షాలు నామమాత్రంగానే కురవగా.. ఇకపై అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ నెలల్లో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, తుపాన్లపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు.

పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం ద్వారా ఏర్పడిన ఎల్‌నినో ప్రభావం ఈ ఏడాది నైరుతి రుతుపవనాలపై కనిపించింది. ఎల్‌నినోతో పంటలకు నీరు అవసరమయ్యే జూలై, ఆగస్ట్‌ నెలల్లో పొడి వాతావరణం నెలకొంది. సాధారణ స్థాయిలోనూ వర్షాలు కురవలేదు. నైరుతి రుతుపవనాల కాలంలో వర్షాలు లేకపోవడం, ఈ రెండు నెలల్లో అల్పపీడనాలు, వాయుగుండాలు కూడా ఏర్పడక వర్షపాతం లోటుకు కారణమైంది. సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలే జిల్లాలో సాగవుతున్న పంటలను రక్షించాయి.

గత ఏడాదితో పోలిస్తే ఈసారి వర్షపాతంలో తీవ్ర లోటు కనిపిస్తోంది. 2025 జూలైలో సగటున 24 సెం.మీ. వర్షపాతానికి గాను 26 సెం.మీ. నమోదైంది. ఆగస్టులో 24 సెం.మీ.కు 37.2 సెం.మీ., సెప్టెంబర్‌లో 17.9 సెం.మీ. గాను 23.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఫలితంగా పంటలు పుష్కలంగా పండాయి. ఈ ఏడాదికొచ్చేసరికి జూలైలో 24 సెం.మీ.కు కేవలం 8.4 సెం.మీ., ఆగస్టులో 24 సెం.మీ.కు 16.5 సెం.మీ. వర్షపాతమే నమోదు కావడం గమనార్హం.

ఈ ఏడాది జిల్లాలో అన్ని పంటలు కలిపి 5లక్షలకు పైగా ఎకరాల్లో సాగయ్యాయి. జూలై, ఆగస్టులో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకున్నా, సెప్టెంబర్‌లో అల్పపీడనం ఆదుకుంది. మూడురోజులపాటు వర్షాలతో ప్రాజెక్టు, చెరువుల్లోకి నీరు చేరింది. పంట చేలు కూడా కళకళలాడాయి. ఈ వర్షం కూడా లేకపోతే పంటలు ఎండిపోయే పరిస్థితి ఎదురయ్యేది. సెప్టెంబర్‌లో 17.9సెం.మీ. సాధారణ వర్షపాతానికి గాను 18.1సెం.మీ.గా నమోదవడంతో నైరుతి రుతుపవనాల చివరలో పంటలకు ప్రాణం పోసింది.

వానాకాలం సీజన్‌ అయిన జూన్‌, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో 26 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మొత్తం 16 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదు కాగా.. కేవలం ఐదు మండలాల్లోనే చెప్పుకోదగిన స్థాయిలో కురిశాయి. ఈ నాలుగు నెలలు కలిపి 79.1 సెం.మీ.కు గాను కేవలం 58.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఎర్రుపాలెంలో 75.3 సెం.మీ.కు గాను కేవలం 39.1 సెం.మీ.తో 48శాతం లోటు నమోదైంది. ఇక కల్లూరు మండలంలో 84.4 సెం.మీ.కు గాను 89 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.

జిల్లాపై తీవ్ర ప్రభావం చూపిన ఎల్‌నినో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement