పట్టభద్రుల ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

పట్టభద్రుల ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి

Oct 1 2026 12:41 AM | Updated on Oct 1 2026 12:41 AM

ఖమ్మం సహకారనగర్‌: వరంగల్‌ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఓటర్ల నమోదు, జాబితా తయారీపై దృష్టి సారించి, అర్హులైన పట్టభద్రులందరికీ ఓటరుగా నమోదు చేయాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన వివిధ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్లు డాక్టర్‌ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ దివాకర మాట్లాడుతూ 2023 అక్టోబర్‌ 31నాటికి డిగ్రీ, తత్సమాన డిప్లొమా ఉత్తీర్ణులైన వారితో ఫారం–18 ద్వారా దరఖాస్తు చేయించాలని తెలిపారు. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తుకు అవకాశం ఉన్న విషయమై అవగాహన కల్పించాలని సూచించారు. గతంలో 84 వేల మందే ఓటర్లు ఉండగా, ఈసారి 2లక్షల మందిని నమోదు చేయించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు. ఈవిషయమై గ్రామాలు, పట్టణాల్లో సభలు నిర్వహించడమే కాక ప్రత్యేక పోస్టర్లు, వీడియోల ద్వారా ప్రచారం చేయాలన్నారు. ఇక ‘ఎస్‌ఐఆర్‌’లో 1,75,858 అనామలీస్‌, నో మ్యాపింగ్‌ ఓటర్లకు గాను 1,69,802 మందికి నోటీసులు జారీచేసి 1,36,208 మంది హియరింగ్‌ పూర్తి చేశామన్నారు. ఈసమావేశంలో కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, ఎస్‌డీసీ సదానందం, ఆర్డీఓ శ్రీనివాస్‌, ఎన్నికల విభాగం డీటీ అన్సారీ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement