ఖమ్మంఅర్బన్: డిజిటల్ యుగంలో విద్యార్థులు సైబర్ భద్రత, నేరాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి సూచించారు. టీ–శాట్ వేదికగా బుధవారం నిర్వహించిన సైబర్ భద్రత అవగాహన కార్యక్రమాన్ని ఖమ్మం ఇందిరానగర్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి ఆమె వీక్షించారు. ఈక్రమాన ఉన్నతాధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించడమే కాక వారి సందేహాలను నివృత్తి చేశారు. సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్ గేమ్స్, డిజిటల్ చెల్లింపుల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆతర్వాత డీఈఓ వాసంతి మాట్లాడుతూ విద్యార్థులు అవగాహన పెంచుకుని మిగతా వారికి వివరించాలని తెలిపారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి పెసర ప్రభాకర్‌రెడ్డి, డీఎస్పీ ఫణీంద్ర, హెచ్‌ఎం స్నేహలత, జిల్లా ఎఫ్‌ఎల్‌ఎన్ సభ్యుడు శ్యామ్‌లాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన డీఈఓ
ఖమ్మం సహకారనగర్: జిల్లా విద్యాశాఖాధికారిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డి.వాసంతి కలెక్టర్ దివాకరను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ సంబంధిత అంశాలపై కలెక్టర్ సూచనలు చేశారు.


