సోలార్‌ ప్లాంట్‌ నిర్వహణ, ఉత్పత్తి పరిశీలన | - | Sakshi
Sakshi News home page

సోలార్‌ ప్లాంట్‌ నిర్వహణ, ఉత్పత్తి పరిశీలన

Oct 1 2026 12:41 AM | Updated on Oct 1 2026 12:41 AM

ఎర్రుపాలెం: మండలంలోని వెంకటాపురంలో 3 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను ఏపీ సీఎం పేషీ అధికారులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు లింగ చంద్రశేఖర్‌, దిలీప్‌ మాట్లాడుతూ ఏపీలోనూ సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ట్ల ఏర్పాటుకు ప్రణాళిక ఉందని తెలిపారు. ఇక్కడ మహిళా సమాఖ్యత ఆధ్వర్యాన ప్లాంట్‌ నిర్వహణ వివరాల ఆధారంగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. కాగా, వెంకటాపురంలోని ప్లాంట్‌ తెలంగాణలో ఆదర్శంగా నిలుస్తోందని ఐకేపీ ఏపీఎం హరినారాయణ, టెక్నీషియన్లు రవికుమార్‌, దిలీప్‌ వెల్లడించారు. ఆతర్వాత ప్లాంట్‌ ఏర్పాటు, ఉత్పత్తి, నిర్వహణ విధానాలను వివరించారు. ఎంపీడీఓ శారద, మధిర మార్కెట్‌ చైర్మన్‌ బండారు నరసింహారావు, సొసైటీల చైర్మన్లు మూల్పురి శ్రీనివాసరావు, వెన్నపూస కృష్ణారెడ్డి, సర్పంచ్‌ తుళ్లూరు నిర్మలకుమారి, డీపీఎం ఆలేటి శ్రీనివాసరావు, సీసీ నవీన్‌కుమార్‌, మహిళా సమాఖ్య ప్రతినిధులు విజయలక్ష్మి, జ్యోతి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బొగ్గుల శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement