మధిరరూరల్: మధ్యాహ్న భోజన నిర్వాహకులు శుచి, శుభ్రతతో పాటు నాణ్యత పాటించాలని జిల్లా విద్యాశాఖాధికారి సదానందం సూచించారు. మధిర మండలం దెందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఆయన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజన నాణ్యత, మెనూ అమలుపై విద్యార్థులను ఆరా తీశారు. పథకం నిర్వహణపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, బోధనపై డీఈఓ సమీక్షించారు. జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు చెరుపల్లి శ్రీహరి, ఇన్‌చార్జ్ హెచ్‌ఎం వి.వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నేడు అండర్–17
ఉషూ జట్ల ఎంపికలు
30న బాలికల కబడ్డీ జట్టు..
2 నుంచి జిల్లా స్థాయి క్యారమ్స్ టోర్నీ
ఏఐకేఎంస్ జాతీయ మహాసభలకు ఏర్పాట్లు
ఖమ్మంమయూరిసెంటర్: అఖిల భారత రైతుకూలీ సంఘం(ఏఐకేఎంఎస్) జాతీయ మహాసభలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.కోటేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో ఈనెల 28నుంచి 30వ తేదీ వరకు మహాసభలు జరగనుండగా, శనివారం నగరంలోని న్యూడెమోక్రసీ కార్యాలయంలో జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలను తయారీని పరిశీలించి ఆయన మాట్లాడారు. సభ ఏర్పాట్లలో పీడీఎస్‌యూ, పీవైఎల్, పీఓడబ్ల్యూ, ఐఎఫ్‌టీయూ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రజాసంఘాల బాధ్యులు నిమగ్నమయ్యారని తెలిపారు. ఈమేరకు 28న జరిగే బహిరంగ సభలో అన్నివర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ, అనుబంధ సంఘాల నాయకులు బండారు ఐలయ్య, గాదె ఝాన్సీ, టి.శ్రీనివాస్, అందె మంగ, ఉదయ్, పవన్, కోల లక్ష్మీనారాయణ, బి కిషన్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
30వరకు
‘ఏక్ పేడ్.. మాకే నామ్’
ఖమ్మం సహకారనగర్: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు కోసం నిర్వహిస్తున్న ‘ఏక్ పేడ్.. మాకే నామ్’కార్యక్రమం కొనసాగుతోందని జిల్లా విద్యాశాఖాధికారి సదానందం తెలి పారు. ఈమేరకు ఖమ్మంలోని సైన్స్ మ్యూజి యంలో శనివారం మొక్కలు నాటాక ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు 1.12లక్షల మొక్కలు నాటగా, ఈనెల 30వ తేదీ వరకు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. అటవీ శాఖాధికారి రాధిక, ఎంఈఓ శైలజాలక్ష్మి, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసరావు, మ్యూజియం ఇన్‌స్ట్రక్టర్ ఈ.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
●ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు శనివారం వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించినట్లు సీఎంఓ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. వ్యాసరచన, వకృత్వ, క్విజ్, డ్రాయింగ్ పోటీలను నిర్వహించగా విజేతలకు ఆదివారం బహుమతులు అందజేస్తామని వెల్లడించారు.


