తనికెళ్లలో డీఎంహెచ్‌ఓ విస్తృత పర్యటన | - | Sakshi
Sakshi News home page

తనికెళ్లలో డీఎంహెచ్‌ఓ విస్తృత పర్యటన

Sep 27 2026 12:52 AM | Updated on Sep 27 2026 12:52 AM

కొణిజర్ల: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ డి.రామారావు శనివారం మండలంలోని తనికెళ్లలో తనిఖీ చేశారు. పల్లె దవాఖానాను సందర్శించిన ఆయన మందులు పంపిణీ, వైద్య సేవల రికార్డులు, వ్యాక్సినేషన్‌పై ఆరా తీశారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందేలా వైద్యులు, సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు. అనంతరం ఎస్సీ బాలుర హాస్టల్‌ను సందర్శించిన డీఎంహెచ్‌ఓ మెనూ అమలుతో విద్యార్థులతో మాట్లాడారు. ఆతర్వాత ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లి 13 ఏళ్లు నిండిన బాలికలు కేన్సర్‌ బారిన పడకుండా హెచ్‌పీవీ టీకా ఆవశ్యకతను వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement