ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్‌కు ఆ పదవి కొనసాగే హక్కు లేదని, వెంటనే రాజీనామా చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సీపీఎం డివిజన్ కమిటీ ఆధ్వర్యాన ఖమ్మం ఎన్నెస్టీ రోడ్డులో సీఈఈ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నున్నా మాట్లాడుతూ ఎన్నికల సంఘంలోని ముగ్గురు కమిషనర్లలో ఇద్దరు ఓటర్ల జాబితా సవరణలు, సర్ అమలుపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా జ్ఞానేష్‌కుమార్ అవే నిర్ణయాలను అమలు చేశారని ఆరోపించారు. దీంతో ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందని ఇన్నాళ్లు చెబుతున్నదంతా అబద్ధమని తేలిందన్నారు. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి లాభం జరిగేలా వ్యవహరించిన జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్, నాయకులు శ్రీనివాసరావు, వంగూరి రాములు, సుబ్బారావు, మెరుగు సత్యనారాయణ, జబ్బార్, నందిపాటి మనోహర్, మెరుగు రమణా, మీరా సాహెబ్, నాగుల మీరా, బోడపట్ల సుదర్శన్, బత్తుల ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.


