కూసుమంచి: పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో బుధవారం రీజినల్ స్థాయి యోగా పోటీలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే పోటీలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని నవోదయ విద్యాలయాలకు చెందిన 288 మంది బాలబాలికలు పాల్గొంటారు. తొలిరోజు పోటీలను ఎంఈఓ రాయల వీరస్వామి ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాక వారిలో సృజనాత్మకత, ప్రతిభను వెలికితీయడంలో నవోదయ ముందు నిలుస్తోందని తెలిపారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ వెంకటరమణ మాట్లాడుతూ రీజినల్ పోటీలకు పాలేరు విద్యాలయ వేదికగా నిలవడం గర్వకారణమని చెప్పారు. ఈ పోటీల్లో విజేతలను ఆగస్టు 30నుంచి పంజాబ్ రాష్ట్రంలోని హోషియార్‌పూర్ జిల్లా నవోదయలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో యోగాసన భారత్ జాతీయ సహాయ కార్యదర్శి నందనం కృపాకర్, పరిశీలకులు ప్రసన్న కుమార్, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హాజరైన ఐదు రాష్ట్రాల విద్యార్థులు


