నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలోని అరుణాచలం రైస్ మిల్లులో రాష్ట్ర విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి వచ్చిన విజిలెన్స్ అధికారుల బృందం ఆధ్వర్యాన బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు కొనసాగాయి. మిల్లుకు సంబంధించి రికార్డుల ఆధారంగా ధాన్యం స్టాక్ ఉందా లేదా అని పరిశీలించారు. సీఎంఆర్ విషయంలో అరుణాచలం రైస్‌మిల్లుపై ఆరోపణల నేపథ్యాన గతంలోనూ పలుమార్లు తనిఖీలు జరిగాయి. ఈనేపథ్యాన సీఎంఆర్ చెల్లించడంలో జాప్యం, తీసుకున్న ధాన్యం ఉందా, లేదా అని పరిశీలనకు విజిలెన్స్ డీఎస్పీ ఆధ్వర్యాన సీఐలు, ఎస్సైలతో పాటు సిబ్బంది, సివిల్ సప్లయీస్ అధికారులు వచ్చినట్లు తెలిసింది. కాగా, తనిఖీల వివరాల పరిశీలన, ఫొటోలు తీసేందుకు మీడియాను అనుమతించలేదు. అయితే, మిల్లులో తనిఖీల నేపథ్యాన మిగతా మిల్లుల నిర్వాహకులు ఉలికిపడ్డారు.
ఉదయం నుంచి రాత్రి వరకు
కొనసాగిన సోదాలు


