‘నీట్‌’ సక్రమంగా నిర్వర్తించలేని కేంద్రం | - | Sakshi
Sakshi News home page

‘నీట్‌’ సక్రమంగా నిర్వర్తించలేని కేంద్రం

Jul 23 2026 12:36 AM | Updated on Jul 23 2026 12:36 AM

లాఠీచార్జ్‌, రాహుల్‌గాంధీ అరెస్ట్‌ అప్రజాస్వామికం

కాంగ్రెస్‌ ఆధ్వర్యాన నిరసనలో మంత్రి తుమ్మల

ఖమ్మంమయూరిసెంటర్‌: లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ ఆధారపడిన నీట్‌ను సక్రమంగా నిర్వర్తించలేని దద్దమ్మ ప్రభుత్వం కేంద్రంలో ఉందనిరాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్‌, ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ తదితరుల అరెస్టును నిరసించడమే కాక కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో ఖమ్మంలో బుధవారం నిరసన తెలిపారు. కాంగ్రెస్‌ కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించగా తుమ్మల మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఢిల్లీ వీధుల్లో ఆందోళన చేస్తుంటే ప్రధాని మోదీ మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణగౌడ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిరంకుశపాలన పోయే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగులు, సుడా, గ్రంథాలయ సంస్థ, మార్కెట్‌ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, మహ్మద్‌ ఖాదర్‌బాబా, యరగలర్ల హన్మంతరావుతో పాటు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, నాయకులు గజ్జెల్లి వెంకన్న, పునుకొల్లు నీరజ, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, బానోత్‌ బాలాజీనాయక్‌, వడ్డేబోయిన నరసింహారావు, మొక్కా శేఖర్‌గౌడ్‌, బొడ్డు బొందయ్య, ముజాహిద్‌, బండి మాధవరావు, రావూరి సైదుబాబు, యర్రం బాలగంగాధర్‌తిలక్‌, మలీదు వెంకటేశ్వరరావు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, కమర్తపు మురళి, రాపర్తి శరత్‌, మిక్కిలినేని మంజుల, కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ, కిలారు అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement