టీటీడీ ఆలయానికి 20ఎకరాల భూమి
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో దర్శనం ఇచ్చారు. తొలుత గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడామండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేనపూజ, కంకణ ధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణం జరిపించారు.
ఖమ్మంఅర్బన్: ఖమ్మం అల్లీపురం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యాన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి 20ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించారు. ధంసలాపురం రెవెన్యూ పరిధిలో ఈ భూమిని కేటాయిస్తూ సోమవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. కాగా, ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయింపు కోసం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీసుకెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేయడంతో భూమి కేటాయింపునకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు.
కేబినెట్ భేటీలో ఆమోదం


