రోడ్లకు సాంకేతిక చికిత్స
బ్లాక్‌స్పాట్ల గుర్తింపు
బాధితులకు వైద్యం, పరిహారం అందేలా ఆసరా
జిల్లాలో ఇప్పటికే
30 బ్లాక్‌స్పాట్ల గుర్తింపు
నిబంధనలు కచ్చితంగా పాటించాలి..
బ్లాక్‌స్పాట్ల వద్ద భద్రతా చర్యలు
కారణాలు, కచ్చితత్వంతో విశ్లేషణ
‘ఐరాడ్’ యాప్‌ను కేంద్ర రోడ్డు రవాణ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది. ఈ అప్లికేషన్‌ను ఫోన్ / వెబ్ సాయంతో వినియోగించవచ్చు. ప్రమాదాలు జరిగినప్పుడు ఆ వివరాలను యాప్‌లో నమోదు చేసి శాసీ్త్రయ దర్యాప్తు నిర్వహించడంతో పాటు బాధితులకు సత్వర వైద్యసేవలు, బీమా క్లెయిమ్‌కు అవకాశం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. అలాగే, ప్రాంతాల వారీగా రోడ్డు ప్రమాదాలకు కారణాలు పొందుపర్చేలా ప్రతీ శాఖలో నలుగురికి తక్కువ కాకుండా శిక్షణ ఇస్తారు.
యాప్‌లోని సమాచారంతో..
యాప్‌లో నమోదైన సమాచారం ఆధారంగా ఎక్కువ ప్రమాదాలు జరిగిన ప్రాంతాల్లో కారణాలు, లోపాలను విశ్లేషిస్తారు. ఆపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ అవసరమైతే రహదారి విస్తరణ, ఇతర చర్యలను చేపడుతుంది. పెద్ద మలుపులు, రహదారి నిర్మాణంలో లోపాలు, స్పీడ్ బ్రేకర్లతో ప్రమాదాలు జరుగుతున్నందున అధికారులు పరిష్కారాలను వెతుకుతారు. ఈ యాప్ సమాచారం పోలీసు శాఖతోపాటు రహదారి భద్రత, వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్, న్యాయవిభాగానికి చెందిన అధికారుల వద్ద కూడా ఉంటుంది. తద్వారా ప్రమాదం జరిగినప్పుడు తక్షణ సాయం అందించడమే కాక ప్రమాదాల నివారణకు ఈ అప్లికేషన్ దోహదపడనుంది.
ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా..
జిల్లాలో అత్యధికంగా ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్లను పోలీస్, ఆర్‌అండ్‌బీ, నేషనల్ హైవే, రవాణ, రెవెన్యూ శాఖ అధికారులు పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. అలాగే, జంక్షన్లు, ప్రధాన రహదారులపై జరిగే ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతా కమిటీ ఏర్పాటైంది. కాగా, బ్లాక్‌స్పాట్ల వద్ద వాహనాల వేగం తగ్గించేలా రంబుల్ స్ట్రిప్స్, లేన్‌మార్కింగ్, రాత్రి సమయాన రహదారులు కనిపించేలా చర్యలు చేపట్టనున్నారు. అంతేకాక ఆక్రమణల తొలగింపుతో పాటు జీబ్రా క్రాసింగ్, సైన్ బోర్డులు, బ్లింకర్లు ఏర్పాటుచేస్తారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాల మేరకు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే 30 బ్లాక్ స్పాట్లను అధికారుల బృందం గుర్తించింది. జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రధాన రహదారుల్లో వీటిని గుర్తించారు. ఖమ్మంలోని ఎన్‌టీఆర్ సర్కిల్, కొత్త బస్టాండ్ సెంటర్, చర్చి కాంపౌండ్ జంక్షన్, మమతా హాస్పిటల్ రోడ్డు, వైరాసెంటర్, జెడ్పీ సర్కిల్, వరంగల్ క్రాస్ రోడ్, ఏదులాపురం క్రాస్ , శ్రీశ్రీ సర్కిల్‌తో పాటు సత్తుపల్లి బైపాస్ జంక్షన్లు, కల్లూరు సెంటర్, కొణిజర్ల, తిరుమలాయపాలెం, తల్లాడ, తనికెళ్ల, పెనుబల్లి, రఘునాథపాలెం, బుడిదంపాడు, మధిర, ఏన్కూరు, లంకపల్లి వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.
‘ఐరాడ్’తో ప్రమాదాలకు కారణాలు, నివారణపై అవగాహన
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలి. మద్యం సేవించి వాహనాలను నడపొద్దు. ఇక ప్రమాదం జరిగినప్పుడు అక్కడి వారు బాధితులకు సాయం అందించాలి. ఐఆర్‌ఏడీ అప్లికేషన్, క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ స్కీమ్, రాహవీర్ పథకం ద్వారా ప్రాణనష్టం తగ్గుతుంది. ప్రమాదాలను తగ్గించి ప్రజలకు భద్రత కల్పించడమే ‘ఐరాడ్’ ముఖ్య ఉద్దేశం.
– హరిబాబు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్, ఐరాడ్
గత మూడేళ్లలో అత్యధికంగా ఎక్కడెక్కడ ప్రమాదాలు జరిగాయో ‘ఐరాడ్’ పోర్టల్ నుంచి తీసుకున్నాం. ఈ సమయాన 500 ప్రాంతాల్లో 3,500 ప్రమాదాలు జరిగాయి. ఇందులో సగం ప్రమాదాలు 50 ప్రాంతాల్లోనే జరగగా, జాబితాలో 30 జంక్షన్లు ఉన్నాయి. దీంతో అక్కడ వాహనాల వేగ నియంత్రణ, ప్రమాదాల కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
– అనుదీప్ దురిశెట్టి, కలెక్టర్
రోడ్లకు సాంకేతిక చికిత్స
రోడ్లకు సాంకేతిక చికిత్స


