ఏడాదిలో లింక్ కెనాల్ పూర్తి
ఖమ్మంరూరల్: వచ్చే జనవరి నాటికి మున్నేరు– లింక్ కెనాల్ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగానే ప్రాజెక్టును ప్రారంభించుకుని ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఆయకట్టు స్థిరీకరణతోపాటు కొత్త ఆయకట్టుకు నీరు ఇస్తాం. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం చారిత్రక ఘట్టం. సీతారామ ప్రాజెక్టు పనులను వేగంగా చేపడుతూ త్వరలోనే పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తే మేం వచ్చాక అంచనా వ్యయం రూ.13 వేల కోట్ల నుంచి రూ.19వేల కోట్లకు పెంచాం.
–ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి
ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే నా జన్మ ధన్యమైనట్లే. గోదావరి జలాలను ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలకు చేర్చాలన్న నా ఆశయానికి అనుగుణంగా సీతారామ ప్రాజెక్టుకు అదనంగా నిధులు మంజూరు చేయడం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో కృష్ణా జలాలు రాకపోయినా 3లక్షల ఎకరాల ఆయకట్టను స్థిరీకరించేందుకు సీతారామ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. పాలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలోనే కాక ఇప్పుడు కూడా నియోజకవర్గం పాడి పంటలతో తులతూగాలని ఆకాంక్షిస్తున్నా.
– తుమ్మల నాగేశ్వరరావు,
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
బీఆర్‌ఎస్ హయాంలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కుప్పకూలింది. కానీ మేం మాత్రం అతి తక్కువ ఖర్చుతో పాలేరు–మున్నేరు లింక్ కెనాల్ నిర్మించనున్నాం. దీన్ని మా బాధ్యతగా స్వీకరించాం. ఇది కాక ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ, సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న మా ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలవాలి.
– వాకిటి శ్రీహరి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి
ఏడాదిలో లింక్ కెనాల్ పూర్తి
ఏడాదిలో లింక్ కెనాల్ పూర్తి


