అటు బందోబస్తు.. ఇటు కవాతు
జిల్లాలో ఆదివారం ఒకేరోజు భారీ సభలు జరిగాయి. సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ మైదానంలో నిర్వహించగా వేలాదిగా పార్టీ శ్రేణులు హాజరయ్యాయి. ఇక ఏదులాపురం మున్సిపల్ పరిధి మద్దులపల్లిలో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు హాజరయ్యారు. ఈ క్రమాన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మద్దులపల్లిలో సభ ముగిశాక ఖమ్మంలోని మంత్రి పొంగులేటి నివాసానికి రోడ్డు మార్గాన వచ్చిన సీఎం భోజనం అనంతరం రోడ్డు మార్గంలోనే సీపీఐ సభకు వెళ్లారు. ఈ సమయాన పలుమార్గాల్లో వాహనాల రాకపోకలను మళ్లించారు. ఇక సీపీఐ ర్యాలీ ప్రారంభం అయిన తర్వాత కొద్దిసేపు మయూరిసెంటర్ బ్రిడ్జిపై ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు చేరుకుని చక్కదిద్దారు. సీఎం సభ, సీపీఐ సభల సందర్భంగా 1,800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయగా ఖమ్మం సీపీ సునీల్‌దత్, భద్రాది కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజు పర్యవేక్షించారు. కాగా, సీపీఐ, కాంగ్రెస్ సభల్లో శ్రేణుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. –స్టాఫ్ ఫొటోగ్రాఫర్ / సాక్షి నెట్‌వర్క్
అటు బందోబస్తు.. ఇటు కవాతు
అటు బందోబస్తు.. ఇటు కవాతు
అటు బందోబస్తు.. ఇటు కవాతు


