రంగం సిద్ధం
85 బీట్లలో గణనకు ఏర్పాట్లు పూర్తి
ఈసారి అటవీ శాఖ సిబ్బందితో పాటు వలంటీర్లకు స్థానం
వన్య ప్రాణుల
గణనకు
ఖమ్మంవ్యవసాయం: జీవ వైవిధ్యాన్ని కాపాడడం, అంతరించిపోతున్న జాతులను గుర్తించడమే కాక సంఖ్యను అంచనా వేసి సంరక్షణ, ఆవాసాల మెరుగైన నిర్వహణకు సమగ్ర చర్యలు తీసుకునేలా వన్య ప్రాణుల గణనకు అధికారులు సిద్ధమవుతున్నారు. పులులు, చిరుతలు, జింకలు, ఎలుగుబంట్లు, దుప్పులు, నక్కలు, అడవి పందులు, రేసు కుక్కలు వంటి జంతువులను లెక్కించేలా అటవీ శాఖ ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి ఈ కార్యమ్రం చేపడుతుంది. ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్ (ఏటీఏ) పేరిట శాఖాహార, మాంసాహార వన్య ప్రాణులను లెక్కిస్తారు.
యాప్‌లో వివరాలు
వన్యప్రాణుల గణనకు అటవీశాఖ సాంకేతికత, శాసీ్త్ర య విధానాన్ని అమలు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించారు. వన్యప్రాణులను సర్వే చేసే సిబ్బంది యాప్‌లో వివరాలతో పాటు ఫొటోలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయా ల్సి ఉంటుంది. అంతేగాక జియో ట్యాగింగ్ చేస్తారు. అలాగే, ఈసారి రాత్రి వేళ కూడా జంతువులను గుర్తించేలా థర్మల్ డ్రోన్లను వినియోగిస్తారు. బీట్‌లో ఎంపిక చేసిన అధికారితో పాటు మరో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి లేదా వలంటీర్ గణనలో పాల్గొంటారు. సర్వే ఉద యం 6 గంటలకు మొదలుపెట్టి ప్రతిరోజూ మూడు కి.మీ. చొప్పున ఐదు రోజుల పాటు 15 కిలో మీటర్లు తిరగాల్సి ఉంటుంది. జంతువులు సంచరించే కాలిబాటలు, పాతదారులు, ఎడ్ల బండ్ల బాటల్లో పరిశీలించాలి. జంతువుల అవశేషాలు, వెంట్రుకలు, కాలి గోర్లు, గుర్తులు, పాదముద్రలు, మలమూత్రాల ఆధారంగా గణన చేపడతారు.
జిల్లాలో వన్యప్రాణుల గణన కోసం ఉద్యోగులు, వలంటీర్లకు నిపుణులతో శిక్షణ ఇప్పించాం. ఖమ్మం, సత్తుపల్లి అట వీ డివిజన్ల వారీగా ఉద్యోగులు గణనకు సిద్ధమయ్యారు. ప్రతీరోజు అధికారులు యాప్‌లో నమోదైన వివరాలను పర్యవేక్షిస్తుంటారు.
–సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, జిల్లా అటవీ అధికారి
జిల్లాలో అటవీ విస్తీర్ణం 60,300 హెక్టార్లుగా ఉంది. ఖమ్మం, సత్తుపల్లి అటవీ డివిజన్ల పరిధిలో ఎని మిది రేంజ్‌లు, 85బీట్లు ఉన్నాయి. ఖమ్మం అటవీ డివిజన్ పరిధి 12వేల హెక్టార్లు, సత్తుపల్లి డివిజన్ పరిధిలో 48,300 హెక్టార్లలో అటవీ విస్తీర్ణం ఉంది. ఇందులో మాంసాహార, శాఖాహార వన్యప్రాణుల గణనకు 88మంది అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధి కారులు, సెక్షన్ అధికారులతో పాటు బీట్ అధికారులు, 35మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కేటాయించారు. అంతేకాక 75మంది వలంటీర్లకు కూడా చోటు కల్పించారు.
నేటి నుంచి
25వ తేదీ వరకు ప్రక్రియ
రంగం సిద్ధం


