అండర్–14 నెట్‌బాల్ టోర్నీ విజేత ఖమ్మం
ఖమ్మంస్పోర్ట్స్: రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్–14 బాలబాలికల నెట్‌బాల్ పోటీల్లో విజేతలుగా ఖమ్మం జట్లు నిలిచాయి. రఘునాథపాలెం మండ లం వీ.వీ.పాలెంలోని సెడార్ వ్యాలీ స్కూల్‌లో రెండు రోజులుగా జరుగుతున్న టోర్నీ ఆదివారం ము గిసింది. బాలుర ఫైనల్స్‌లో ఖమ్మం – మహ బూబ్‌నగర్ జట్లు తలపడగా ఖమ్మం జట్టు టైటిల్ గెలుచుకుంది. బాలికల విభాగంలో ఖమ్మం – కరీంనగర్ జట్ల మధ్య ఫైనల్ జరగగా ఖమ్మం విజేతగా నిలిచింది. ఇకబాలుర విభాగంలో కరీంనగర్, బాలికల్లో ఆదిలాబాద్ జట్లు తృతీయ స్థానం దక్కించుకున్నాయి. విజేతలకు కాపా ఆదినారాయణ, సెడా ర్ వ్యాలీ ప్రిన్సిపాల్ ఆర్.పార్వతీరెడ్డి, జిల్లా పాఠశాలల క్రీడల కార్యదర్శి వై.రామారావు బహుమతులు అందజేయగా నెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు సీహెచ్.దీప్తి, కార్యదర్శి ఫణి, పీడీలు పీవీ రమణ, నాగయ్య, మాధవి తదితరులు పాల్గొన్నారు.
అండర్–14 నెట్‌బాల్ టోర్నీ విజేత ఖమ్మం


